Moviesవెంక‌టేష్ తొలి సినిమా వెన‌క మీకు తెలియ‌ని ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

వెంక‌టేష్ తొలి సినిమా వెన‌క మీకు తెలియ‌ని ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ ఇది ఎంత విజయవంతమైన ప్రస్థానం తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. శతాధిక చిత్రాల నిర్మాతగా సినిమా రంగంపై తన కంటూ ఎంత మక్కువ‌ వుందో రామానాయుడు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఈ రోజు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారందరూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమాలు చేసినవారే. రామానాయుడు ఎప్పుడు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుండేవారు. ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాల ద్వారానే ఎంతో మంది అగ్ర దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

నాడు ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ తో మొదలు పెడితే ఈతరం క్రేజీ హీరోల వరకు ఎంతోమందితో సినిమాలు నిర్మించిన ఘనత సురేష్ ప్రొడక్షన్ సొంతం. రామానాయుడు వారసులుగా సినిమా రంగంలోకి వచ్చిన సురేష్ బాబు – వెంకటేష్ బాబు తమదైన ముద్ర వేసుకున్నారు. సురేష్ బాబు ఈ రోజు అటు నిర్మాతగా కొనసాగుతుండటంతో పాటు ఇండస్ట్రీలోని పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఇక వెంకటేష్ మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామానాయుడు స్వయంగా నిర్మించారు.

రాఘవేంద్ర రావుతో సినిమా తీయాలని నిర్ణయించుకున్న రామానాయుడు ఒకరోజు అమెరికాలో ఉన్న వెంకటేష్ కు ఫోన్ చేశారట. బాబు ఏం చేస్తున్నావు అని అడగగా… ఇప్పటికే పరీక్షలు అయిపోయాయి ఖాళీగా ఉన్నాను అని చెప్పారట. సినిమాల‌లో నటిస్తావా అని రామానాయుడు అడగగా… ఇక్కడ స్నేహితులు కూడా మీ నాన్న నిర్మాతగా ఉన్నారు… నువ్వు ఎందుకు ? సినిమాల్లో నటించకూడదు అని అడుగుతున్నారని వెంకటేష్ చెప్పాడట.

వెంటనే వెంకటేష్ ఇండియాకు పిలిపించిన రామానాయుడు… అప్పటికి వెంకటేష్‌కు తెలుగు రాకపోవడంతో ఒక తెలుగు మాస్టారును పెట్టి ఆరు నెలలపాటు వెంకటేష్‌కు ట్యాఊష‌న్ పెట్టించారు అట.
ఆ తర్వాత డ్యాన్సులలోనూ… ఫైట్లలో కూడా శిక్షణ ఇప్పించారు. అనంతరం రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాలో వెంకటేష్ నటించారు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఆ తరువాత ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news