Moviesహీరోగా సిద్ శ్రీరామ్‌... డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

హీరోగా సిద్ శ్రీరామ్‌… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

సిద్ శ్రీరామ్ ఇప్పుడు ఈ పేరు చెపితే యూత్‌లో ఎలా పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయో తెలిసిందే. శ్రీరామ్ పాడే ఒక్కో పాట మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో ఓ స్టార్ హీరోకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పుడు సిద్ శ్రీరామ్‌కు కూడా అంతే క్రేజ్ ఉంటోంది. శ్రీరామ్ పాడిన ప్ర‌తి పాట సూప‌ర్ హిట్ అవుతోంది. సినిమా కంటెంట్ యావ‌రేజ్‌గా ఉన్నా కూడా శ్రీరామ్ పాట‌ల‌తో ఆ సినిమాలు సూప‌ర్ హిట్ అవుతున్నాయి.

శ్రీరామ్ పాట‌లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ప్ర‌స్తుతం సిద్ శ్రీరామ్ తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో పాపుల‌ర్ సింగ‌ర్‌. ఈ రెండు భాష‌ల్లో స్టార్ హీరోలు అంద‌రూ త‌మ సినిమాల్లో శ్రీరామ్ ఒక్క పాట అయినా పాడాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో మ‌నోడి మార్కెట్ ఇప్పుడు మామూలుగా లేదు. శ్రీరామ్ పాట పాడుతోన్న తీరులో ఓ విధ‌మైన ఫీల్ క‌లుగుతోంది.

ఆ పాట‌లు మ‌న‌స్సుకు హ‌త్తుకుంటున్నాయి. ఇక సిద్ శ్రీరామ్ చూడ‌డానికి కూడా చాలా అందంగా ఉంటాడు. హీరోగా కూడా మ‌నోడు ట్రై చేసుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టికే చాలా మంది స‌జెష‌న్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతుంద‌ని తెలుస్తోంది. శ్రీరామ్ వెండితెర ఎంట్రీ కోలీవుడ్ నుంచి జ‌ర‌గ‌బోతోంద‌ని అంటున్నారు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో శ్రీరామ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌న్న ప్ర‌చారం అయితే బ‌లంగా వినిపిస్తోంది.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌డ‌ల్ సినిమాతో శ్రీరామ్ కోలీవుడ్‌కు సింగ‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్పుడు అదే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోడు వెండితెర హీరోగా రాబోతున్నాడు. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం – శ్రీరామ్ మ‌ధ్య క‌థాచ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ క్రేజీ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news