Moviesఅన‌సూయ భ‌ర్త లైఫ్ గురించి ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఇదే..!

అన‌సూయ భ‌ర్త లైఫ్ గురించి ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఇదే..!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ ఇప్పుడు బుల్లితెర‌తో పాటు వెండితెర‌ను కూడా షేక్ చేసేస్తున్నారు. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా అల‌రించిన ఆమె ఇటీవ‌ల వ‌చ్చిన పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా దంచేశారు. పుష్ప పార్ట్ 1లో దాక్షాయ‌ణి పాత్ర‌కు స్కోప్ త‌క్కువ ఉన్నా.. సెకండ్ పార్ట్‌లో ఆమె పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని సుకుమార్ ఇప్ప‌టికే చెప్పారు. అన‌సూయ‌కు రంగ‌మ్మ‌త్త పాత్ర వ‌చ్చాక ఇప్పుడు వెండితెర‌పై ఆమెకు క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇక బుల్లితెర‌పై ఆమె ఎప్పుడూ త‌న హాట్ అందాలు, స్వీట్ వాయిస్‌తో త‌న ప్రోగ్రామ్స్ రేటింగ్‌లు దుమ్ము దులిపించేస్తూ ఉంటుంది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన అన‌సూయ కుర్ర‌, క్రేజీ హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చేలా న‌టిస్తోంది. ఇక అన‌సూయ‌ది ప్రేమ వివాహం. అన‌సూయ భ‌ర్త గురించి బ‌య‌ట‌కు పెద్ద‌గా ఏ విష‌యాలు రావు. ఆమె భ‌ర్త పేరు భ‌ర‌ద్వాజ్‌.

అన‌సూయ కాలేజ్ చ‌దివేట‌ప్పుడే సుశాంక్ భ‌ర‌ద్వాజ్‌తో ఎన్సీసీ క్యాంప్‌లో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో అత‌డితో ప్రేమ‌లో ప‌డింది. ఇక పెద్ద‌ల‌ను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య‌, అయాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. త‌న భ‌ర్త గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన అన‌సూయ ఆయ‌న ఫైనాన్షియ‌ర్ అని, అలాగే ఫండింగ్ ప్లాన‌ర్ అని చెప్పింది.

గ‌తంలో అన‌సూయ త‌న భ‌ర్త‌ను ఓ బుల్లితెర ప్రోగామ్ ద్వారా అంద‌రికి ప‌రిచ‌యం కూడా చేసింది. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ త‌న గురించి ట్రోలింగ్ జ‌రుగుతూ ఉండ‌డంతో తాను చాలాసార్లు బాధ ప‌డ్డాన‌ని అయితే.. త‌న భ‌ర్త ప్రోత్సాహంతో వాటిని ఎదుర్కొన్నాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news