Moviesఅప్పుడు సమంత.. ఇప్పుడు కృతి.. అస్సలు తగ్గట్లేదుగా..?

అప్పుడు సమంత.. ఇప్పుడు కృతి.. అస్సలు తగ్గట్లేదుగా..?

కృతి శెట్టి.. అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతుంది. కేవలం ఒక్కటి అంటే ఒక్కటే సినిమాతో తన తల రాతను ఆమె మార్చుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయమైన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తాను ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్తర్ కి నిర్మాతలకి ఆమె కావిలి. ఎందుకంటే అమ్మడు క్రేజ్ అలా ఉంది బయట. దీంతో స్టార్ హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో ఉంచుకునేలా చూసుకుంటున్నారు.

ఉప్పెన సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న కృతి శెట్టి..ఆ తరువాత నాని పక్కన శ్యాం సింగరాయ్ మూవీలో యంగ్ హీరోయిన్ గా హాట్ రొమాన్స్ తో ఇరగదీసింది. అంతేనా నాని తో ఇప్పటి వరకు ఎవ్వరు చేయని బెడ్ సీన్స్ కూడా చేసి అందరికి షాకిచ్చింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. దీంతో రెండో సినిమా తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమా గా నాగ చైతన్యకి భార్య గా నటిస్తుంది. బంగార్రాజు రాజు సినిమాలో కృతి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ బంగార్రాజు సినిమా జనవరి 14 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో కృతి,నాగ చైతన్య,నాగార్జున ముగ్గురు కూడా చాలా యాక్టీవ్ గా పాల్గోంటూ బంగార్రాజు సినిమాకి వీలైనంత హైప్ తీసుకొస్తున్నారు. ఇక ఇక్కడే కృతి బిహేవియర్ చూసిన జనాలకి చాలా వింతగా అనిపిస్తుందట. సాధారణంగా నాగార్జున లాంటి బడా హీరో సినిమాలో అవకాశం రావడమే కృతికి గొప్ప విషయం..ఇక దానితోపాటు ఇంటర్వ్యుల్లో కూడా అమ్మడుకి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నరటే అది నిజంగా గ్రేట్.

ఇక మొదటిసారి తండ్రి కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి.. వాళ్లతో మింగిల్ అయిన తీరు చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందట. షూటింగ్ టైంలో కూడా తండ్రి కొడుకులను అస్సలు విడిచిపెట్టేది కాదట. వారితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేదట. ఇక అక్కినేని ఇంటి మాజీ కోడలు సమంత కూడా తన సినీ కెరీర్ మొదలైన కొత్తలో ఇలాగే అక్కినేని భజన చేసేవారట. ఇక మనం సినిమా షూటింగ్ టైంలో కూడా అలానే ఓవర్ గా బీహేవ్ చేసారట. దీంతో నెటిజన్స్ అప్పుడు సమంత ..ఇప్పుడు కృతి సేం అక్కినేని భజన అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news