Moviesఆ డైరెక్టర్ అంత దారుణంగా మోసం చేశాడా.. నయనతార ఓపెన గా...

ఆ డైరెక్టర్ అంత దారుణంగా మోసం చేశాడా.. నయనతార ఓపెన గా చెప్పిన నిజాలు

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో నిలిచే నయనతార అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. గత కొంత కాలంగా త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణం నడుపుతున్న నయన్..వచ్చే ఏడాది రెండో నెలలో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం నజరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా, నయనతార తన సినీ కెరీర్ లో ఎన్నో డైరెక్టర్స్ తో నటించినా ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, మోసం చేయడం కానీ చేయలేదట. కానీ ఒక్కే ఒక్క డైరెక్టర్ అది కూడా స్టార్ దర్శకుడు ఆమెను చిట్ చేసాడట. అతి దారుణం నమ్మించి మోసం చేసాడట. ఈ విషయాలను స్వయంగా నయనతార ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకురావడం గమనార్హం. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాలో నయన్ చేసిన చిన్నదే అయిన మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ విషయంలో డైరెక్టర్ ఆమెను మోసం చేసాడట. సినిమాలో తన క్యారెక్టర్‌ చెప్పెటప్పుడు మురుగదాస్ ఓ రేంజ్ లో చెప్పారని..ఆ తరువాత షూటింగ్ టైంలోను ఆమెకు సరిగ్గ మర్యాదా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా తనకు స్టోరీ చెప్పెటప్పుడు ఒకలా చెప్పి తెర పై మాత్రం నయన్ క్యారెక్టర్ ను ఇంకోలా చూయించారు అంటూ ఓపెన్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది నయన్. దర్శకుడు తన పాత్ర చెప్పినట్టుగా చిత్రీకరించలేదని, తన లుక్‌ కూడా అంత బాగాలేదని కామెంట్ చేసింది. నయన్ వ్యాఖ్యలపై మురుగదాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటీనటుల వ్యక్తి గత అభిప్రాయాల అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయనని చెప్పుకొచ్చిన ఆయన ఒక్కొసారి తనకు నచ్చని వారికి కూడా మంచి పాత్రలు ఇస్తుంటాం.ఒక్కోసారి మన ఫేవరేట్ నటీనటులకు చిన్న పాత్రలు కూడా ఇవ్వాల్సిన సందర్భాలొస్తాయని క్లారీటీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news