MoviesReview 2021: తెలుగు తెరపై మెరిసిన కొత్త తారలు!

Review 2021: తెలుగు తెరపై మెరిసిన కొత్త తారలు!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమ్మది హీరోయిన్స్ ఉన్నా కూడా రోజుకో కొత్త హీరోయిన్ తెర పై కి వచ్చి సందడి చేస్తూ తన అదృష్టాని పరిక్షించుకుంటుంది. కానీ హీరోయిన్ అవ్వాలి అంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు..కష్ట పడే తత్వం కూడా ఉండాలి. అనీ ఉన్నా కూడా అదృష్టం ఉంటేనే హిట్ కొట్టి సెట్ అవ్వగలరు. ఇక ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కొంతమంది భామలు వెండితెరకి పరిచయం అయి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. వారెవరో తెలుసుకుందాం.

కృతి శెట్టి: ఒక్కటి అంటే ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఉప్పెన సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో హాట్ రొమాన్స్ చేసి..కుర్రాళ్ల మతి పోగొట్టింది. ఈ సినిమా త‌రువాత వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న నాని శ్యామ్ సింగ‌రాయ్ లో కూడా నానితో లిప్ లాక్ చేసి యువతను రెచ్చ్కొడుతుంది. ఇక నాగచైతన్య తో కూడా నటిస్తూ.. బడా బడా ఆఫర్స్ అందుకుంటుంది కృతిశెట్టి. చెక్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. అనంత‌రం ఇష్క్ సినిమాలో కూడా న‌టించింది. ఈ సినిమాలేవి ఈమెకు క‌లిసి రాలేదు.

ఫ‌రియా అబ్దుల్లా: తన క్యూట్ క్యూట్ స్మైల్ తో జాతిర‌త్నాలు సినిమాలో ఫుల్ కామెడీతో కడుపబ్బ నవ్వించిన ఈ చిట్టి..ఒక్క సినిమాతోనే సెన్షేష‌న‌ల్ హిట్ అందుకుంది. చిట్టి పాత్ర‌లో న‌టించి అంద‌రిచేత వారెవ్వా అనిపించుకున్న‌ది. ఆ త‌రువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లోనూ ఓ చిన్న రోల్ చేసి అందరిని మెప్పించింది. ఇప్పుడు నాగార్జున బంగార్రాజు సినిమాలో ఓ స్పేషల్ సాంగ్ చేస్తుంది. ఇక డీ 2 లో కూడా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

శ్రీ‌లీల :పెళ్లి సంద‌డి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ క్యూట్ అమ్మడు. లేలేత అందాలతో రెచ్చ్కొడుతూ..అధ్బుతమైన డ్యాన్స్ తో ఇరగదీసిన క‌న్న‌డ బ్యూటి శ్రీ‌లీల, అందం, అభిన‌యంతో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంది.అటు ర‌వితేజ‌తో ధ‌మ‌కా సినిమా కూడా చేస్తుంది.

కేతికా శ‌ర్మ‌: రొమాంటిక్ సినిమాతో హాట్ రొమాన్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ అమ్మడు.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు రొమాన్స్ లోని క్త్తదనాని ప‌రిచ‌యం చేసింది. కేతికా శ‌ర్మ‌ ల‌క్ష్య సినిమాలోనూ సందడి చేసింది. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే ఏ రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news