Moviesతారక్ నార్త్-చరణ్ సౌత్..కానీ, రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..!!

తారక్ నార్త్-చరణ్ సౌత్..కానీ, రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..!!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌)’మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీల్లో భారీ అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటి సారి చరణ్, తారక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడంతో ఈ మూవీ కోసం నందమూరి, మెగా ప్యామిలీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు..ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలోకూడా రాజమౌళిది ఢ్ఫరెంట్ స్ట్రాటజీ. ఏ దర్శకుడు చేయనంత పక్క ప్లానింగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కు అదే స్ధాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. అయితే సినిమాలో తెర పై ఎంత ఎలా ఉన్నారో ఇక బయట మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో కూడా రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

ఇక రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముగ్గురు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. వాళ్ల మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పుతూ..స్టజీ పైనా రాజమౌళి ఎమోషనల్ కావడంతో టీవీ లో చూస్తున్న అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపు మూడేళ్లుగా RRR సినిమాను రూపొందించిన అనుభవాన్ని.. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పంచుకున్నాడు రాజమౌళి. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. వాళ్లిద్దరి వల్లే.. RRRసినిమా సాధ్యమైందని చెప్పాడు. తారక్ నార్త్ పోలార్ అయితే… చరణ్ సౌత్ పోలార్. ఇలాంటి భిన్న ధృవాలు కలిసి RRR ను ఈ స్థాయికి తీసుకొచ్చారు” అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో.. ఎమోషనల్ అయిన రాజమౌళిని చరణ్, తారక్ ఇద్దరూ ఆప్యాయంగా హత్తుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. “తారక్ తో నేని ఇది వరకు సినిమాలు చేసాను కాబటి నాకు ఆయన గురించి బాగా తెలుసు. సో నేను ఏదైన సీన్ చెప్పితే వెంటనే క్యాచ్ చేసి..నాకు కావాల్సిన ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చేవాడు. దీంతో నాకు నా పని చాలా సులువుగా అయిపోయింది. నేను ఉదయం 7 గంటలకు సెట్ కు రావాలని చెబితే తారక్.. 6 గంటలకే వచ్చేస్తాడు. అంత కమిట్ మెంట్ ఉన్న మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు.అందుకే.. తారక్ కు టైమ్ సెన్స్ లేదని నేను అంటుంటా. ఇంత కమిటెడ్ గా పని చేసే నటుడు దొరకడం నాకు, తెలుగు సినిమాకు మాత్రమే కాదు.. భారత సినీ పరిశ్రమ సైతం చేసుకున్న అదృష్టం” అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.. రాజమౌళి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news