Moviesటాప్ బిజినెస్‌మెన్‌తో సీరియ‌ల్ బ్యూటీ ఎఫైర్‌..!

టాప్ బిజినెస్‌మెన్‌తో సీరియ‌ల్ బ్యూటీ ఎఫైర్‌..!

ఇటీవ‌ల కాలంలో బుల్లితెర‌పై క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్‌కు వెండితెరపై ఎంత క్రేజ్ ఉంటుందో బుల్లితెర‌పై హాట్ హాట్‌గా న‌టిస్తోన్న న‌టీమ‌ణుల‌కు కూడా అంత‌కు మించి క్రేజ్ ఉంటోంది. బుల్లితెర‌పై న‌టిస్తోన్న వాళ్ల‌కు ఉండే క్రేజ్ కార్తీక‌దీపం సీరియ‌ల్ చూస్తేనే మ‌న‌కు తెలుస్తుంది. ఇక కొంద‌రు బుల్లితెర‌ను ఏలేసి వెండి తెర‌పై కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే జెమినీ టీవీలో నాగిని సీరియ‌ల్ ద్వారా ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది ముంబై బ్యూటీ మౌనీ రాయ్‌.

నాగిని సీరియ‌ల్ ద్వారా ఆమె త‌న న‌ట‌న ఫ్రూవ్ చేసుకోవ‌డంతో కొంద‌రు దర్శక నిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. దీంతో సెకండ్ హీరోయిన్ ఛాన్సులు చేయ‌డంతో పాటు ఐటెం సాంగులు చేసుకుంటూ బాలీవుడ్‌లో బాగా సంపాదిస్తోంది. అయితే ఇటీవ‌ల ఆమె ఓ టాప్ వ్యాపార‌వేత్త‌తో ప్రేమ‌లో ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. మౌనీరాయ్ దుబాయ్‌లో జ‌రిగిన ఓ ఈవెంట్‌కు హాజ‌రు అయ్యింద‌ట‌.

అదే స‌మ‌యంలో అక్క‌డ ఓ వ్యాపార‌వేత్త‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని తెలుస్తోంది. ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య ఘాటు ఎఫైర్ న‌డుస్తోంద‌ని టాక్ ? అయితే మౌనీ రాయ్‌పై ఈ త‌ర‌హా వార్త‌లు రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఆమె బాలీవుడ్‌కు చెందిన ఓ సీరియ‌ల్ హీరోతో కూడా ప్రేమ‌లో మునిగిపోయింద‌ని.. అత‌డినే పెళ్లి చేసుకోబోతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు దుబాయ్ బిజినెస్‌మేన్‌తో ల‌వ్వాయ‌ణం అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఆమె హాట్ హాట్ ఫొటోల‌తో ఎప్పుడూ సోష‌ల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. ఆమె సోష‌ల్ మీడియా అక్కౌంట్ల ద్వారా ప‌లు వ్యాపార సంస్థ‌ల ఉత్పత్తుల‌ను ప్ర‌మోట్ చేస్తూ ల‌క్ష‌లు ఆర్జిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news