Moviesవారెవ్వా..క్యా సీన్ హై..డబ్బు కోసం ఇంత నీచంగానా..?

వారెవ్వా..క్యా సీన్ హై..డబ్బు కోసం ఇంత నీచంగానా..?

కాజల్ అగర్వాల్..ఈమె ఓ టాలీవుడ్ చందమామ. తన అందంతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఓ మిత్రవింద. టలీవుడ్ లోకి ఎంటర్ అయిన అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసి..వచ్చిన ఏ చిన్న అవకాశాని వదులుకోకుండా బదా బడిగా సినిమాలు చేసుకుంటూ పోతూ.. తన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలను వేసుకున్న ఓ పంచదార బొమ్మ. కోలీవుడ్ లోను తనదైన స్టైల్లో రాణించిన కాజల్ అగర్వాల..అక్కడ కూడా ఆల్ మోస్ట్ అందరి టాప్ హీరో సరసన నటించింది.

ఇక ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఓ ఇంటిది అయ్యింది. ఆమె త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకుని హ‌నీమూన్ ఎట్టకేలకు సక్సె ఫుల్ గా 1 యుఏర్ ఫినిష్ చేసుకుని ..గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. కాగా రీసెంట్ గా కాజల్ చేసిన పనికి నెట్టింట ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూటా ఇలా చేయడం తగునా నీకు కాజల్ అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇంతకు నెటిజన్లకు అంత కోపం వచ్చే పని కాజల్ ఏం చేసిందో తెలుసా..?

దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న భ‌ర్త తో క‌లిసి ఓ ఆల్కాహాల్ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేసింది కాజల్. ఈ పండుగ సీజన్‌ను మీ ప్రియమైన వారితో, దీపావళి పార్టీలకు సరైన భాగ‌స్వామి టీచ‌ర్స్ 50 (టేచెర్’స్ 50) -స్మూత్ లిక్విడ్ గోల్డ్ తో జ‌రుపుకోండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. అంతే ఈ పోస్ట్ పెట్టిన కాజల్ కు దిమ్మతిరిగే ఆన్సర్స్ ఇస్తున్నారు నెటిజ‌న్లు. దీపావ‌ళి పండుగ రోజు.. ఆల్కాహాల్‌ నా..? ఏమైనా బుద్ధి ఉందా నీకు..అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ పని కాజ‌ల్‌ అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కామెంత్స్ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన్నట్లు వారు రాసుకుంటున్నారు. ఒకరు ఏమో భార్యకు తగ్గ భర్త ..ఇద్ద‌రు క‌లిసే వేసేస్తున్నారా..? మేడ‌మ్ అంఅంటే.. మరోకరు ఏమో మీ దుంప‌ల్ తెగ..మీరు ఎక్క‌డ త‌గిలారు రా బాబు అంటూ ఫ‌న్నీ కామెంట్ పెడుతున్నారు. ఫైనల్ గా కాజల్ నెట్టింట ట్రోల్స్ కి గురిచేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news