Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్‌... దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా..!

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్‌… దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా..!

నంద‌మూరి బాల‌కృష్ణ ఓటీటీ ఎంట్రీ అదిరిపోయింద‌నే చెప్పాలి. అన్‌స్టాప‌బుల్ ప్రోమోల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌తి ఒక్క‌రు కూడా స‌రికొత్త బాల‌య్య‌ను.. స‌రికొత్త షోను చూస్తున్నామ‌ని అంటున్నారు. దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా ? అంటూ ప్రోమోతోనే అద‌ర‌గొట్టేశాడు. బాల‌య్య డైలాగులు చూస్తుంటే ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంను అద‌ర‌గొట్టేశాలా ఉన్నాడు.

ఓటీటీ ఫ్లాట్ ఫాంకు ఓ సినిమాటిక్ క‌ళ‌ను తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా ఈ అన్‌స్టాప‌బుల్ షోకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్న అంచ‌నాలు కూడా అప్పుడే వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే మంచు ఫ్యామిలీ ఈ షోలో పాల్గొంది. బాల‌య్య వ‌ర్సెస్ మోహ‌న్‌బాబు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలిపోయాయ‌ని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఇద్ద‌రూ కూడా కాస్త ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాల‌తో పాటు పార్టీల వ‌ర‌కు పోయార‌ని కూడా తెలుస్తోంది.

అందుకే తండ్రి పెట్టిన పార్టీని బాబు చేతుల్లోకి ఎందుకు పెట్టావు ? అని మోహ‌న్‌బాబు బాల‌య్య‌ను అడిగితే.. బాల‌య్య కూడా అన్న‌గారు పెట్టిన పార్టీ ఉండగా.. మ‌రో పార్టీలోకి ఎందుకు వెళ్లావ‌ని కౌండ‌ర్‌గా అడిగేశాడు. ఇదిలా ఉంటే ఈ షోకు ఇప్పుడు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా వ‌స్తున్నాడ‌ట‌.

మోహ‌న్‌బాబు ఫ్యామిలీ ఇంట‌ర్వ్యూ త‌ర్వాత నాని, ప్ర‌భాస్‌ల ఇంట‌ర్వ్యూలు వ‌స్తాయ‌ట‌. ఏదేమైనా అన్‌స్టాప‌బుల్ షో రికార్డులు కూడా అన్‌స్టాప‌బుల్ లాగానే న‌మోదు అయ్యేలా ఉండ‌నున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news