Moviesనా కారులో ఖచ్చితంగా అది ఉండాల్సిందే.. అందరిని నవ్వించిన బాలయ్య..!!

నా కారులో ఖచ్చితంగా అది ఉండాల్సిందే.. అందరిని నవ్వించిన బాలయ్య..!!

సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా అందరిని ఆకట్టుకునేలా బాల్య్యతీ ఓ టాక్ చేస్తున్న విషయ్మ్ తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ విత్ ణ్భ్ఖ్ పేరుతో వచ్చిన ఈ షోలో బాలయ్య హోస్ట్‏గా అదరగొట్టేసారు అనే చెప్పలి. టాలివుడ్ లో విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్.. డా.మంచు మోహన్ బాబు ఈ షో లో ఫస్ట్ గెస్ట్‌గా తన కోడుకు విష్ణు..కూతురు లక్ష్మి తో వచ్చి సందడి చేసారు.

ఇక బాలయ్య షోకి రెండో గెస్ట్ గా నాటురల్ స్టార్ నాని వచ్చారు. రీసెంట్ గా దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. ప్రోమో ఆధారంగా..ఈ షో లో బాలయ్య నాని సర్దాగా గడిపినంట్లు అర్ధమౌతుంది. ఫన్నీ డైలాగ్స్ తో బాలకృష్ణ బాగా నవ్వించారు. షోకి గెస్ట్ గా వచ్చిన నానిని బాలయ్య గ‌ల్లీ క్రికెట్ ఆడ‌తావా అని అడిగాడు . అప్పుడు నాను అవును అని చెప్పడం మనం ప్రోమోలో చూడవచ్చు.

 

ఇక అప్పుడే బాలయ్య నేను సెట్‌లో క్రికెట్ ఆడుతానంటూ చెప్తాడు. అంతేకాదు క్రికెట్ కిట్ ఎప్పుడు త‌న కారులో ఖచ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన బాల‌య్య.. గార్డ్‌ కూడా ఉంటుంద‌ని చెప్పి న‌వ్వించాడు.ఇక ఏదో విష‌యంలో పులిహోర క‌ల‌ప‌కు అంటూ నానిని ఉద్దేశించి అంటాడు బాల‌య్య‌.టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజైన సందర్భంగా తనపై డిస్ట్రిబ్యూటర్స్ చేసిన కామెంట్స్‌పై మరోసారి ఈ షోలో నాని మరోసారి మాట్లాడినట్లు అర్థమవుతోంది.

ప్రోమో చూస్తుంటే ఇది కూడా మంచి ఎంట‌ర్‌టైన్ అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రోమో అయితే అదిరిపోయింది. ఆ తర్వాత సినిమాల విడుదల సమయంలో ఎదురుకున్న సమస్యలను నాని బాలయ్యకు చెప్పడం కాస్త ఇంట్రెస్టింగ్‌‌గా అనిపించింది. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్‌‌ని చూడాలంటే నవంబరు 12 వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news