Moviesఒక్కే మొబైల్ నంబర్ ఇద్దరు వినియోగిస్తే.. ‘అద్భుతం’గా ఉంటాదట..!!

ఒక్కే మొబైల్ నంబర్ ఇద్దరు వినియోగిస్తే.. ‘అద్భుతం’గా ఉంటాదట..!!

తేజ సజ్జా..ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ యువ నటుడు తేజ అనేక తెలుగు సినిమాలలో బాల నటుడిగా నటించి తన నటనతో మెప్పించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాలలో బాల నటుడిగా మెప్పించిన తేజ. సమంత “ఓ బేబీ” సినిమా ద్వారా సహనటుడిగా ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత హీరోగా “జాంబీ రెడ్డి” సినిమాతో బ్లక్ బస్టర్ అందుకున్నాడు. “జాంబి రెడ్డి” తరువాత తాజాగా తేజ “ఇష్క్” అనే సినిమా చేసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది.

కాగా తేజ సజ్జా హీరోగా, రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘అద్భుతం’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మ‌ల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేస్తూ…కొత్త‌ అప్‌డేట్‌ను మేక‌ర్స్ అందించారు. అద్బుతం చిత్రాన్ని డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.డిస్నీ+హాట్‌స్టార్ (డిస్నెయ్+ హొత్స్తర్)లో నవంబ‌ర్ 19న గ్రాండ్‌గా ప్రీమియ‌ర్ కాబోతుంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ అద్బుతం చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌నందించాడు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్‌ నంబర్‌ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నదే కథ. ఈ ట్రైలర్‌ ప్త్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మొగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌పై అంచనాలు పెంచేశాయి. మరి ఈ సినిమాతో తేజ హిట్‌ అందుకుంటాడేమో చూడాలి. మరి ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.. !!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news