Moviesఅన్‌స్టాప‌బుల్ సాంగ్‌లో రెచ్చిపోయిన బాల‌య్య‌.. డ్యాన్స‌ర్‌తో చిలిపిగా.. (వీడియో)

అన్‌స్టాప‌బుల్ సాంగ్‌లో రెచ్చిపోయిన బాల‌య్య‌.. డ్యాన్స‌ర్‌తో చిలిపిగా.. (వీడియో)

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్‌కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ పేరుతో ఓ టాక్ షో చేస్తున్నాడు. ఈ టాక్ షో ఫ‌స్ట్ ఎపిసోడ్ దీపావ‌ళి కానుక‌గా ఇప్ప‌టికే స్ట్రీమింగ్ అయ్యింది. మంచు మోహ‌న్ బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు విష్ణు, కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా ఈ షోల పాల్గొన్నారు. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కే అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. బాల‌య్య టాక్ షోలో కుమ్మి ప‌డేశాడు అని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు బాల‌య్య సెకండ్ ఎపిసోడ్ నేచుర‌ల్ స్టార్ నానితో చేస్తున్నాడు. నాని – బాల‌య్య‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంది. ఓ సినిమాలో నాని బాల‌య్య వీరాభిమానిగా క‌నిపిస్తాడు. అలాగే బాల‌య్య న‌టించిన శ్రీరామ‌రాజ్యం సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ సినిమాకు బాపు ద‌ర్శ‌కుడు కాగా.. నాని అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. అలా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం నేప‌థ్యంలోనే బాల‌య్య త‌న రెండో గెస్ట్‌గా నానినే చాయిస్ తీసుకున్నాడు.

ఇక ఇప్ప‌టికే రెండో ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో వ‌చ్చింది. తాజాగా అన్‌స్టాప‌బుల్ షోకు సంబంధించి నంద‌మూరి నాయ‌కా సాంగ్ ప్రోమో వ‌చ్చింది. బాల‌య్య ఈ సాంగ్‌లో డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి రెచ్చిపోయారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా మ‌రో ఇర‌వై ఏళ్లు వెన‌క్కు వెళ్లి మ‌రీ బాల‌య్య డ్యాన్స్ చేసిన‌ట్టు క‌నిపించింది. బాల‌య్య‌లో వ‌య‌స్సు పై బ‌డినా ఆయ‌న ఎన‌ర్జీ మాత్రం ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేద‌నే చెప్పాలి.

పైగా డ్యాన్స‌ర్ బొడ్డు పై నుంచి చేయి పైకి క‌దుపుతూ త‌న‌లో రొమాంటిక్ బాల‌కృష్ణుడిని కూడా బ‌య‌ట పెట్టారు. యువ డ్యాన్స‌ర్ల‌తో పోటీ ప‌డుతూ చేసిన డ్యాన్స్ సూప‌ర్బ్‌గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news