Moviesజ‌క్క‌న్నా మ‌రీ ఇంత ఊర నాటా... R R R ఊర‌నాటు...

జ‌క్క‌న్నా మ‌రీ ఇంత ఊర నాటా… R R R ఊర‌నాటు సాంగ్‌ ( వీడియో)

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా క‌లిసి తెర‌పై స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచ‌నాలు మామూలుగా లేవు.

రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా సుధీర్ఘంగా షూటింగ్ జ‌రుపుకోవ‌డంతో పాటు వాయిదాల మీద వాయిదాలు ప‌డతూ వ‌స్తోన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లో చూస్తామా ? అన్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే రిలీజ్ గ్లింప్స్‌తో పాటు ప్రోమోలు సినిమాపై అంచ‌నాలు ఆకాశానికి పెంచేశాయి. తాజాగా నాటు నాటు ప్రోమో రిలీజ్ అయ్యి ఓ ఊపు ఊపేసింది. ఈ రోజు ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

ట్రిపుల్ ఆర్ లో ఊర నాటు సాంగ్‌గా వైర‌ల్ అవుతోన్న ఈ నాటు సాంగ్ డ్యాన్స్ కూడా మ‌రీ నాటుగా ఉంది. 3.28 నిమిషాల పాటు ఉన్న సాంగ్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ క‌లిసి వేస్తోన్న డ్యాన్సులు అయితే మ‌రీ ఊర‌నాటుగా హోరెత్తించేస్తున్నాయి. ఇద్ద‌రూ కూడా రెచ్చిపోయి మ‌రీ డ్యాన్సులు వేశారు.

ఇక ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టిస్తోన్న విదేశీ అమ్మాయి ఒలీవియా అయితే ఈ సాంగ్‌లో డ్యాన్సులు వేయ‌లేక వేయ‌లేక వేస్తూ వ‌స్తోంది. ఇక రాజ‌మౌళి టేకింగ్ మాత్రం మ‌రోసారి బాహుబ‌లి రేంజ్లోనే ఉంటుంద‌ని ఆయ‌న ఇస్తోన్న స‌ల‌హాలు చూస్తూనే అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా సాంగ్‌తోనే ఊర‌నాటు అంతా చూపించేశాడు రాజ‌మౌళి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news