Moviesబ్రేకింగ్: పవర్ స్టార్ కు గుండె నొప్పి..ఐసీయూలో చికిత్స..!!

బ్రేకింగ్: పవర్ స్టార్ కు గుండె నొప్పి..ఐసీయూలో చికిత్స..!!

యస్..మీరు చదువుతున్నది నిజమే. పవర్ స్టార్ కు గుండె నొప్పి వచ్చి..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు వార్తలు గుప్పుమన్నాయి.ఈ న్యూస్ వినగానే అభిమానుల్లొ ఒకటే టెన్షన్ నెలకొంది. అయితే ఇక్కడ పవర్ స్టార్ అనగానే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుని అభిమానులు టెన్షన్ కి గురైయ్యారు. కానీ ఇక్కడ హాట్ అటాక్ వచ్చింది శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.. యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్.

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకుగురైయ్యారు.దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిన్నత్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news