Moviesషాకింగ్: చెప్పు తీసుకొని తలకు కొట్టుకున్న నిరుపమ్.. అసలు ఏం జరిగిందో...

షాకింగ్: చెప్పు తీసుకొని తలకు కొట్టుకున్న నిరుపమ్.. అసలు ఏం జరిగిందో తెలుసా..??

నిరుపమ్‌ పరిటాల.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో కానీ డాక్టర్‌ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్‌. ప్రస్తుతం నడుస్తున్న నాటికలలో కార్తీకదీపం సీరియల్ కు మొదటి స్థానం దక్కిందని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.

ఇదిలా వుంటే తాజాగా డాక్టర్‌ బాబు అదేనండి నిరుపమ్‌ పరిటాల చేసిన పని నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మధ్య సెలబ్రిటీలు..సామాన్యులు అందరు యూట్యూబ్ మీద పడుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ఓ ఛానల్ క్రియేట్ చేసి..అందులో వాళ్ల లైఫ్ స్టైల్ గురించి,వాళ్ల షూటింగ్ లు గురించి,ఇంటి గురించి,షాపింగ్ ల గురించి వివరిస్తూ ఉమటారు. తద్వార ఆ వ్యూస్ వల్ల వీళ్లకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలా మంద్ సెలబ్రిటీస్ ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. సో ..రీసెంట్ గా ఈ లిస్ట్ లో పరిటాల నిరుపమ్ యాడ్ అయ్యారు.

నిరుపమ్‌ పరిటాల ఆయన భార్య మంజుల ఇద్దరూ కలిసి మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ ఛానల్ ను గత కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. షాకింగ్ ఏమిటంటే..వీరు చేసిన రెండు వీడియోలు మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా కొద్ది రోజులకే వీరీ ఛానల్ కు 50 వేల సబ్స్క్రైబర్లు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మాములు విషయం కాదు. పక్క యూట్యూబఅర్స్ కొన్ని సంవత్సరాల నుండి ట్రై చేస్తున్న ఇన్ని వ్యూస్..సంపాదించలేకపోయారు. కానీ మంజుల నిరుపమ్ కు చాలా తక్కువ టైంలోనే ఇది సాధించారు.

పరిటాల నిరుపమ్ మంజుల కలిసి ముంబై ట్రిప్ కి వెళ్ళారు. అయితే ఫ్లైట్ కి టైం అవుతుందని స్పీడ్ గా డాక్టర్ బాబు కారు నడుపుతుంటే మంజుల మాత్రం చెప్పులు షాపింగ్ చేస్తూ ఉంటారు. దీంతో నిరుపమ్‌ “ఆడవాళ్ళు చనిపోయే సమయంలో కూడా షాపింగ్ చేయడం మానరా..??” అంటూ చెప్పు తీసుకొని తలకు కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news