Moviesనయనతారను విఘ్నేష్‌ శివన్‌ అలానే పిలుస్తాడట..ఎందుకంటే..??

నయనతారను విఘ్నేష్‌ శివన్‌ అలానే పిలుస్తాడట..ఎందుకంటే..??

నయనతార లేడీ అమితాబ్. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార. కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలతో తమిళనాట సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో నయన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ అయ్యింది. అందుకే ఇక్కడ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అమ్మడు.

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌నతార‌, కోలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివ‌న్ ఎప్ప‌టి నుంచో ప్రేమాయ‌ణంలో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలో న‌య‌న‌తార న‌టించింది. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య మొద‌లైన స్నేహం.. విఘ్నేష్ తీరు ఆమెను ఆక‌ట్టుకోవ‌డంతో చివ‌ర‌కు న‌య‌న్ అత‌డి ప్రేమ‌కు లొంగిపోయింది. అంత‌కు ముందే హీరోలు శింబు, ప్ర‌భుదేవాతో న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారాలు పెళ్లి వ‌ర‌కు వెళ్లి వెన‌క్కు వ‌చ్చేశాయి. అయితే విఘ్నేష్ శివన్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న నయనతార పెళ్లెప్పుడు అంటే మాత్రం నోరు విప్పదు.

అయితే తాజాగా నయనతారను ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్‌ శివన్‌ ఏమని పిలుస్తారు అనే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకి అయ్యగారు మేడం ని ఏమని పిలుస్తారో తెలుసా..?? ‘తంగమ్‌’. యస్ ‘తంగమ్‌’ అని పిలుస్తారట. నిజానికి ‘తంగమ్‌’ అంటే బంగారం అని అర్థం. ఇప్పుడు నయనతార అదే పేరుని తన మాతృభాష మలయాళంలో చేయనున్న తాజా సినిమాకు ఉపయోగించుకుంటుందట. తన తదుపరి సినిమాలు ‘గోల్డ్‌’ అనే టైటిల్‌ ఖరారైందని టాక్ వినిపిస్తుంది. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరో గా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news