Moviesమెగా అభిమానుల్లో ఫూనకాలు స్టార్ట్.. ఊర మాస్‌ లుక్ లో కేక...

మెగా అభిమానుల్లో ఫూనకాలు స్టార్ట్.. ఊర మాస్‌ లుక్ లో కేక పుట్టిస్తున్న చిరంజీవి..!!

యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా..ఆరు ప‌దుల వ‌య‌సులోనూ సూప‌ర్ ఫాస్ట్ గా సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ.. ఆ నాటి చిరును గుర్తుకు తెస్తున్నారు..టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి. నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తన అభిమానులకు నచ్చే విధంగా అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

ప్రస్తుతం చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. “పూనకాలు లోడింగ్‌” అంటూ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. చిరు లుక్‌ని రివీల​ చేయకపోయినా పోస్టర్‌ని బట్టి ఇది ఊర మాస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చిరు 154వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మూవీ మేకరస్. అంతేకాకుండా ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటుంద‌ట‌. ఇక చిరు నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ తెగ సంబరంలో మునిగిపోయారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news