Moviesకేజీఎఫ్ 2 విడుదల తేదీ వచ్చేసిందోచ్..ఎప్పుడంటే..??

కేజీఎఫ్ 2 విడుదల తేదీ వచ్చేసిందోచ్..ఎప్పుడంటే..??

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ తెర‌కెక్కిన సినిమా కేజీఎఫ్‌. క‌ర్నాట‌క‌లోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ 2018 డిసెంబ‌ర్లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఇక దీంతో ఈయన ఒక కొత్త రికార్డును సృష్టించాడు. స్టార్ హీరోలు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేశాడు. అయితే కే జి ఎఫ్ – 2 సినిమా కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్ర‌మంలో కేజీఎఫ్ ను క‌న్న‌డ సినీ ప్రేక్ష‌కులు క‌న్న‌డ బాహుబ‌లితో పోల్చుకున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 సైత కేజీఎఫ్‌ను మించిన హిట్ అవుతుంద‌ని ఆశ‌ల‌తో ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా అంచ‌నాలు ఉన్న ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల కానుందని ఇటీవల ప్రకటించిన కరోనాతో పాటు ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్టర్ ని విడుదల చేశాడు. “హంబుల్ ఫిలిమ్స్” తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేసింది.

ఆ పోస్ట్ లో..”మా పనులు ఆలస్యంగా కారణంచేత, ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న 2022 న థియేటర్లలో విడుదల చేయబోతున్నాం.. అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక అందులోనే నటించే వారి పేర్లను మెన్షన్ చేస్తూ.. ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఆ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news