Moviesవామ్మో..ఆ హీరోతో పక్కన యాక్ట్ చేయడానికి శ్రీదేవి ఇన్ని కండీషన్ పెట్టారా..??

వామ్మో..ఆ హీరోతో పక్కన యాక్ట్ చేయడానికి శ్రీదేవి ఇన్ని కండీషన్ పెట్టారా..??

అలనాటి అందాల తార శ్రీదేవి.. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఏకైక నటి. ఆమె బ్రతికి ఉండగానే కూతురిని హీరోయిన్ గా చూడాలని అనుకున్నారు కాని అది జరగలేదు. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి. ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే..శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే.

ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అయితే, చిరంజీవితో ఓ సినిమాలో నటించడం కోసం ఈ అందాల ముద్దుగుమ్మ కొన్ని కండీషన్స్ పెట్టిందట.. అవి విని డైరెక్టర్ షాక్ అయ్యారట. ఇమతకి ఆ కండీషన్స్ ఏంటో ఇక్కడ చూసేయ్యండి..

చిరంజీవినటించిన ‘కొండవీటి దొంగ’ ఈ సినిమాలో చిరంజీవికి జంటగా విజయశాంతి , రాధా హీరోయిన్ లుగా నటించిన విషయం మంకు తెలిసిందే. అయితే ఈ సినిమా తెర వెనుక చాలా కధనే నడిచిందట. ఈ సినిమాకు కోదండ రామ్ రెడ్డి దర్శకత్వం వహించగా టి . త్రివిక్రమరావు నిర్మాత . పరుచూరి బ్రదర్స్ కథ మరియు డైలాగ్స్ రాశారు . పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

మొదట కొండవీటి దొంగ అనే సినిమా పేరుతో ఒక కథ రాసి.. అది మన మెగాస్టార్ చిరంజీవి కి వినిపిస్తే.. కధ సూపర్ నేను నటిస్తా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ప్రొడ్యూసర్ గారు హీరోయిన్ గా మన అతిలోక సుందరి శ్రీదేవి తీసుకుందాం అని అనడంతో ఆయనే స్వయంగా వెళ్లి శ్రీదేవి కి కథ వినిపించారట..అంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత.. ఆ కథను విన్న హీరోయిన్.. స్టోరి బాగుంది కానీ అందులో కొన్ని మార్పులు చేస్తేనే నటిస్తాను అందట. దాంతో ఆయన షాక్ అయ్యారట.

ఇంతకి ఆ మార్పులు ఏంటంటే..సినిమా పేరు కొండవీటి దొంగ కాకుండా కొండవీటి రాణి కొండవీటి దొంగ అని పెట్టమని కోరిందట శ్రీదేవి. సినిమాలో హీరోయిన్.. హీరో వెనకపడి లవ్ చేసినట్లు ఉన్న సీన్లను తొలగించి.. హీరోయిన్ వెనకే హీరో పడే విధంగా సీన్స్ రాయండి అని చెప్పిందట. ఆ విషయాలను తిరిగి నిర్మాతకు చెప్పితే త్రివిక్రమరావు ఒప్పుకోలేదట. మళ్లీ ఫ్రెష్ గా ఒక కథను రాయండి అని చెప్పారట. ఆ తరువాతే ఈ కథలోకి విజయశాంతి , రాధ , శారదా వచ్చారని ఇప్పుడు మీరు చూస్తున్న సినిమా రెండవ సారి రాసిన కథ అని తెలిపారు ఆయన. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news