Gossipsఎన్టీఆర్ అలా అనేసరికి.. ఉప్పెన దర్శకుడు చాలా హర్ట్ అయ్యాడట..?

ఎన్టీఆర్ అలా అనేసరికి.. ఉప్పెన దర్శకుడు చాలా హర్ట్ అయ్యాడట..?

ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు సుకుమార్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా గానీ తక్కువ సినిమాలు చేసినా కానీ సుకుమార్.. చేసే సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి.. చాలా మందిని అవురా అనిపించేలా చేస్తాయి. సుకుమార్ ఫ్లాప్ సినిమాలు కూడా చూసి చాలామంది దర్శకులు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సుకుమార్ ఇండస్ట్రీలో తాను మాత్రమే కాకుండా తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు లైఫ్ ఇవ్వటం జరిగింది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు.

సినీ పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో పని చేసిన ప్రతి ఒక్కరూ మెగా ఫోన్ పట్టేయరు. దర్శకుడిగా అవకాశం అందుకున్నా సరే.. సరైన సినిమా పడాలి, దానికి క్రేజ్ రావాలి, అది బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలి. అప్పుడే అన్నేళ్లు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. ఐతే ఇలా అందరికీ జరగదు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎన్నో కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, గుర్తింపుకు నోచుకోని వాళ్లు.. తొలి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో రాత్రికి రాత్రి వారి జీవితాలు మారిపోయిన ఉదంతాలు చాలానే టాలీవుడ్లో కనిపిస్తాయి. ‘ఉప్పెన’తో పరిచయం అయిన యువ దర్శకుడు బుచ్చిబాబుది ఇలాంటి స్టోరీనే. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే హీరోలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా సరే అంటున్నారు. దానికి కారణం ఈ మధ్య విడుదలైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా. ఈ చిత్రంతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈయన సుకుమార్‌కు ప్రియ శిష్యుడు. గురువు గారి పేరు నిలబెడుతూ తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు.

అయితే ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ రెండో సినిమా ఎప్పుడు..?? ఎవరితో ..?? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే, బుచ్చిబాబు రెండోసినిమా ఎన్టీఆర్‌తోనే అన్న ప్రచారం బలంగా వినిపిస్తున్న సమయంలో ..సూపర్‌హిట్‌తో తారక్‌కు కథ కూడా చెపప్పేసాడు అంటున్న వస్తున్న వార్తల తరుణంలో.. తారక్ దానికి బ్రేకులు వేసాడు. ఆమధ్య తారక్‌ ఓ హాలీవుడ్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటిస్తున్నట్టు చెప్పాడు. బుచ్చిబాబు పేరు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. బుచ్చిబాబు రెడీ చేసిన బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఎన్టీఆర్ నచ్చినా.. ఇప్పట్లో ఈ మూవీ ఉండదు. ఆర్ఆర్‌ఆర్.. కొరటాల… ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు ముందు పూర్తికావాలి. ప్రయారటీ ప్రకారం చూస్తే.. బుచ్చిబాబు సినిమా 2023లో ఉండొచ్చేమో అన్న మాటలి సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news