Moviesవారెవ్వా..స్టైలిష్ స్టార్ క్రేజీ రికార్డ్.. చరిత్రను తిరగరాసిన బన్నీ..!!

వారెవ్వా..స్టైలిష్ స్టార్ క్రేజీ రికార్డ్.. చరిత్రను తిరగరాసిన బన్నీ..!!

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. పాన్‌ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. కెరీర్ మొదట్లోనే అగ్రదర్శకులతో కలిసి పనిచేసే అవకాశం సంపాదించుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి ఎన్నో విజయాలను తన కతాలో వేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు సొంతం తన చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. రెండు నెలల క్రితం విడుదలైన పుష్ప టీజర్ కు మాత్రం 75 మిలియన్ వ్యూస్ వచ్చాయి..ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే..మన బన్నీ వాళ్ల మామ..మెగాస్టార్ చిరంజీవిని మించిపోయాడు.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. సినిమా టీజర్ ఇప్పటికే విడుదల కాగా దానికి కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది. దాదాపు ఐదు నెలల క్రితం ఆచార్య టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ఇప్పటి వరకు 21 మిలియన్ వ్యూస్ వస్తే.. రెండు నెలల క్రితం విడుదలైన పుష్ప టీజర్ కు మాత్రం 75 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో బన్నీ మామ ను రికార్డు ను బద్దలు కొట్టిన్నట్లైంది. ఆచార్య అనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ లనే ఈ రేంజిలో వ్యూస్ సాధించిన మరో తెలుగు సినిమా టీజర్ లేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news