Moviesకేజీఎఫ్ 2 ఆడియో రికార్డ్ సేల్‌... సౌత్ ఇండియా నెంబ‌ర్ 1

కేజీఎఫ్ 2 ఆడియో రికార్డ్ సేల్‌… సౌత్ ఇండియా నెంబ‌ర్ 1

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ తెర‌కెక్కిన సినిమా కేజీఎఫ్‌. క‌ర్నాట‌క‌లోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ 2018 డిసెంబ‌ర్లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో హీరో య‌శ్‌తో పాటు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఓవ‌ర్ నైట్ స్టార్లు అయిపోయారు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా ఈ సినిమా రెండో పార్ట్ రిలీజ్ కాలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అంద‌రూ ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపై ఉన్న ప్రి రిలీజ్ బ‌జ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానుంది. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా అంచ‌నాలు ఉన్న ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్‌ను ఏరియాల వారీగా సొంతం చేసుకునేందుకు బ‌డా బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2 గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో రైట్స్ నే ఏకంగా రు. 7.2 కోట్లకి అమ్ముడుపోయాయని తెలిసింది.

ఈ ఫిగ‌ర్ టోట‌ల్ సౌత్ ఇండియా సినిమా హిస్ట‌రీలోనే హ‌య్య‌స్ట్ అట‌. సౌత్ ఇండియాలోని నాలుగు భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఏ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో ఆడియో రైట్స్ అమ్ముడు కాలేదంటున్నారు. దీనికి ముందు ఉన్న సినిమా కోలీవుడ్ స్టార్ విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్‌. ఆ సినిమా ఆడియో రైట్స్‌ను రు 4.5 కోట్ల‌కు అమ్మారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 దానిని బీట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news