Moviesబ‌న్నీ VS చెర్రీ కోల్డ్‌వార్‌లో మ‌రో ట్విస్ట్‌..!

బ‌న్నీ VS చెర్రీ కోల్డ్‌వార్‌లో మ‌రో ట్విస్ట్‌..!

మెగా కాంపౌండ్ లో ఊహించని పోటీతత్వం బయటపడుతోందా ? అంటే కొద్ది రోజులుగా ఇద్ద‌రు యంగ్ హీరోల మ‌ధ్య జ‌రుగుతోన్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తోన్న వారు వారిద్ద‌రి మ‌ధ్య కెరీర్ పరంగా ప్ర‌చ్చ‌న్న యుద్ధ‌మే న‌డుస్తోంద‌ని అంటున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గ‌త నాలుగేళ్లుగా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. రంగ‌స్థ‌లం సినిమా ముందు వ‌ర‌కు బ‌న్నీకి వ‌రుస హిట్ల‌తో క్రేజ్ ఉండేది. ఆ త‌ర్వాత బ‌న్నీకి వ‌రుస ప్లాపులు వ‌స్తే రంగ‌స్థ‌లంతో చెర్రీ బ‌న్నీ మార్కెట్‌ను దాటేశాడు. ఇక గ‌త సంక్రాంతికి అల సినిమాతో బ‌న్నీ చెర్రీ సినిమాల రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసేశాడు.

ఇక ఇప్పుడు చెర్రీ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులే చేస్తున్నాడు. శంక‌ర్ సినిమా, ఆచార్య‌, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు బ్యాక్ టు బ్యాక్ వ‌స్తున్నాయి. ఇక శంక‌ర్ సినిమా ఎనౌన్స్ చేసి ఒక్క‌సారిగా చెర్రీ నేష‌న‌ల్ వైడ్‌గా వార్త‌ల్లో నానుతున్నాడు. దీంతో ఇప్పుడు అంద‌రి అటెన్ష‌న్ ఈ క్రేజీ ప్రాజెక్టు మీదే ఉంది. దీంతో బ‌న్నీ కూడా ఒక్కసారిగా చెర్రీ మీద పై చేయి అన్న‌ట్టుగా మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌తో సినిమాకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ తో పుష్ప 1, 2 సినిమాలు తీస్తూ జాతీయ స్థాయి మార్కెట్ టార్గెట్ చేశాడు. ఇక ఇప్పుడు వేణు శ్రీరామ్‌తో ఐకాన్‌కు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఏఆర్‌. మురుగ‌దాస్‌తో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చెర్రీ – శంక‌ర్ సినిమాకు పోటీగా చేస్తోందే అంటున్నారు. ఏదేమైనా ఈ ఇద్ద‌రి మ‌ధ్య కాంపిటేష‌న్ అయితే మామూలుగా లేద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news