Gossipsబిగ్‌బాస్‌లోకి యాంక‌ర్ల క్యూ... లిస్ట్ ఇదే...!

బిగ్‌బాస్‌లోకి యాంక‌ర్ల క్యూ… లిస్ట్ ఇదే…!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్ బాస్ 5వ సీజ‌న్ ప్రారంభించేందుకు తెర‌వెన‌క స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అస‌లు ఈ బిగ్‌బాస్‌లోకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు ? అన్న‌దానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా నాలుగో సీజ‌న్ త‌ర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన వారికి మంచి పాపులారిటీ వ‌స్తుండ‌డంతో ఐదో సీజ‌న్లోకి వెళ్లేందుకు బుల్లితెర సెల‌బ్రిటీలు, సినిమాల్లో అవుట్ డేటెడ్ అయిన వాళ్లు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు.

ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ ఐదో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మీడియం రేంజ్ యాంక‌ర్లు, చిన్నా చిత‌కా యాంక‌ర్లే కాదు టాప్ యాంక‌ర్లు సైతం త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నార‌ట‌. అరియానా, అవినాష్ లాంటి వాళ్లు బిగ్ బాస్ కు వెళ్లి సెలబ్రిటీలు అయిపోయారో అప్ప‌టి నుంచి చాలా మంది బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు దుముకుతున్నారు. ఏదోలా హౌస్‌లో పాపుల‌ర్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చాక సెల‌బ్రిటీల దృష్టిలో ప‌డిపోవాల‌న్న‌దే వారి ప్లాన్‌.

ఇక ఇప్పుడు టిక్ టాక్ షోలో పాపుల‌ర్ అయిన దుర్గారావు పేరు ఈ లిస్టులో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయితే దుర్గారావు కండీష‌న్లు కూడా పెడుతున్నాడ‌ట‌. త‌న భార్య‌ను కూడా లోప‌ల‌కు తీసుకు వ‌స్తే.. తాము ఇద్ద‌రం కంటెస్టెంట్లుగా ఉంటామ‌ని.. తాను ఒక్క‌డినే రాన‌ని చెపుతున్నాడ‌ట‌. ఇక షార్ట్ ఫిలింల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ పేరు కూడా బిగ్ బాస్ జాబితాలో ఉంద‌ట‌. మ‌రి ఇంకెవ‌రెవ‌రు ఈ లిస్టులో చేర‌తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news