Moviesమ‌హేష్ సూప‌ర్‌స్టార్ కాదు.. హాలీవుడ్ జేమ్స్‌బాండే... ఇదేం రెమ్యున‌రేష‌న్‌..!

మ‌హేష్ సూప‌ర్‌స్టార్ కాదు.. హాలీవుడ్ జేమ్స్‌బాండే… ఇదేం రెమ్యున‌రేష‌న్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్లో డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ నిర్మించే సినిమాలో న‌టిస్తారు. ఈ సినిమాను రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తారు. అంత‌కంటే ముందే మ‌హేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో అత‌డు, ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు ఇద్ద‌రికి మంచి పేరు అయితే తీసుకు వ‌చ్చాయి కానీ.. బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ హిట్లు అయితే కాలేదు.

అయితే త్రివిక్ర‌మ్ చాలా క‌సితో ఉన్నాడ‌ట‌. ఈ సారి మ‌హేష్‌కు బ్లాక్ బస్ట‌ర్ ఇవ్వ‌డ‌మే టార్గెట్‌గా ఈ సినిమా కోసం ప‌ని చేస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హేష్ రు. 55 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఈ సినిమాకు తీసుకుంటున్నాడ‌ట‌. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు కూడా రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కూడా అంత కంటే మూడు , నాలుగు కోట్లు ఎక్కువే పుచ్చుకుంటున్నాడ‌ని అంటున్నారు.

అయితే రు. 55 కోట్లు కొంత న‌గ‌దు రూపంలో.. కొంత షేర్ రూపంలో ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ని అంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం. త్రివిక్ర‌మ్‌కు సొంత బ్యాన‌ర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. పార్దు అనే టైటిల్ ఈ సినిమాకు వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news