Moviesటాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో సెగ‌లు రేపుతోన్న మీనాక్షి చౌద‌రి... !

టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో సెగ‌లు రేపుతోన్న మీనాక్షి చౌద‌రి… !

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా మల్లూవుడ్ భామ‌ల హ‌వానే న‌డుస్తోంది. వ‌రుస పెట్టి మ‌ల్లూ భామ‌లు స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టేస్తున్నారు. అయితే మ‌ల్లూ భామ‌ల‌తో పోటీ ప‌డుతూ మ‌న హీరోలు మ‌రో కొత్త అందం అయిన మోడ‌ల్ మీనాక్షి చౌద‌రిని రంగంలోకి దింపుతున్నారు. మాస్ మ‌హ‌రాజ్ క్రాక్ త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌ను తీసుకోవాల‌నుకున్నా ఇప్పుడు ఆమె ప్లేస్ మీనాక్షి చౌద‌రి కొట్టేసిందంటున్నారు.

 

అడిష‌న్స్‌లోనే మీనాక్షి న‌ట‌న చూసి మేక‌ర్స్ షాక్ అయ్యార‌ట‌. ఇక మీనాక్షి ఇప్ప‌టికే అక్కినేని హీరో సుశాంత్ సరసన ఇచట వాహనములు నిలపరాదు సినిమాలో న‌టించింది. ఇప్పుడు ర‌వితేజ ప‌క్క‌న ఛాన్స్ కొట్టేసింది. ఇక మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ ప‌క్క‌న కూడా ఆమె పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఏదేమైనా వ‌రుస‌గా యంగ్ క్రేజీ హీరోల సినిమాల్లో మీనాక్షి ఛాన్సులు కొట్టేస్తుండ‌డంపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ సాగుతోంది. మీనాక్షి పేరుకు తగ్గట్టే అభినయనేత్రిగా మెరిపిస్తే కొన్నేళ్ల పాటు ఆమెకు తెలుగు సినిమా రంగంలో తిరుగు ఉండ‌ద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news