Moviesఒక‌ప్ప‌టి తెలుగు క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా..!

ఒక‌ప్ప‌టి తెలుగు క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా..!

క‌న్న‌డ హీరోయిన్ సంఘ‌వి రెండు ద‌శాబ్దాల క్రితం తెలుగులోనే కాకుండా సౌత్‌లో పాపుల‌ర్ హీరోయిన్‌. ఆమె తెలుగులో బాల‌య్య‌, నాగార్జున‌, వెంకీ, చిరంజీవి ప‌క్క‌నే కాకుండా ప‌లువురు హీరోల‌తో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించింది. సంఘ‌వి క‌న్న‌డ అమ్మాయి అయినా ఆమె ముందుగా త‌మిళ్‌లో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. బాల‌య్య ప‌క్క‌న స‌మ‌ర‌సింహారెడ్డి, వెంకీ ప‌క్క‌న సూర్య‌వంశం, నాగార్జున ప‌క్క‌న సీతారామ‌రాజు, చిరంజీవి ప‌క్క‌న మృగ‌రాజు సినిమాల్లో న‌టించింది.

 

ఆ త‌ర్వాత ఆమె సినిమాల్లో బిజీ బిజీ అయినా అవ‌కాశాలు త‌గ్గిపోయాక బెంగ‌ళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 2016లో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ వెంకటేష్‌ను పెళ్లాడింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉంటోన్న సంఘ‌వి దంప‌తుల‌కు ఒక బాబు ఉన్నాడు. చాలా గ్యాప్ త‌ర్వాత సంఘ‌వి ఇటీవ‌లే త‌మిళ్ సినిమాతో త‌న సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది.

 

ఇక సెకండ్ ఇన్సింగ్స్‌లో ప‌లు సినిమాల్లోనూ, కొన్ని టాలీవుడ్ బుల్లితెర షోల‌కు వ్యాఖ్యాతగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు దొరికితే మ‌ళ్లీ సినిమాలు చేస్తాన‌ని సంఘ‌వి చెపుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news