ఫార్మాట్ ఏదైనా బంతిని బలంగా సిక్స్ స్టాండ్‌లోకి తరలించే వాళ్లలో వెస్టిండిస్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్ ఒకడు. అటు బ్యాట్‌తోనే కాదు ఇటు బంతితోనూ మ్యాజిక్ చేస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్లో తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడంలో రస్సెల్ విఫలమవుతున్నాడు. దీంతో రస్సెల్ యాంటీ ఫ్యాన్స్ అంతా అతడి భార్య జెస్సిమ్ లోరాకు అసభ్యంగా మెసేజ్‌లు పంపుతున్నారట.
ఆమెను ఆంటీ అని పిలవడంతో పాటు మీరు కాస్త బూస్ట్ ఇవ్వండి రస్సెల్ ఫామ్‌లోకి వస్తాడని చెపుతున్నారట. దీంతో రస్సెల్ భార్య జెస్సిమ్ మీరేమి టెన్షన్ పడొద్దు నెక్ట్స్ మ్యాచ్‌లలో రస్సెల్ ఫామ్‌లోకి వచ్చి సత్తా చాటుతాడంటూ ఆమె కామెంట్ చేస్తోంది. అయితే నెటిజన్ల తీరుపై కొందరు ఫైర్ అవుతున్నారు. క్రికెటర్ల వైఫల్యాలపై వాళ్ల ఇంట్లో వాళ్లను, భార్యలను కామెంట్ చేయడం కరెక్ట్ కాదని రస్సెల్‌కు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక చెన్నై వైఫల్యం నేపథ్యంలో ధోనీ కుమార్తె జీవాపై అత్యాచారం చేస్తామంటూ ఓ యువకుడు పెట్టిన కామెంట్ దుమారం రేపడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.