Politicsతెలంగాణ‌లో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు... వీళ్లు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..

తెలంగాణ‌లో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు… వీళ్లు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఏపీ తీరానికి ద‌గ్గ‌ర్లో ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నంతో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఇది మ‌రింత బ‌ల‌ప‌డ‌డంతో భారీ ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షం కురిసింది. అయితే ఈ అల్ప‌పీడ‌న ప్ర‌భావంతోనే తెలంగాణ వ్యాప్తంగా మ‌రో నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy rain pummels Hyderabad city

ఈ జిల్లాల ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా సూచ‌న‌లు జారీ చేసింది. తెలంగాణ‌లో ఆదిలాబాద్‌, కొమ‌రం భీం, సిద్ధిపేట‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌పల్లి, ములుగు, కొత్త‌గూడెం, నిర్మ‌ల్‌, జగిత్యాల‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

ఇక ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్ర‌జ‌లు కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news