Moviesడ్ర‌గ్స్ కేసులో ర‌కుల్‌ప్రీత్‌కు మ‌ళ్లీ షాక్‌... ఎన్సీబీ చెప్పేసింది..

డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్‌ప్రీత్‌కు మ‌ళ్లీ షాక్‌… ఎన్సీబీ చెప్పేసింది..

డ్రగ్స్ కేసు వ్యవహారం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ ఇష్యూలో జ‌రుగుతోన్న విచార‌ణ నేప‌థ్యంలో ఒక్కో లింకు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ కేసులో మ‌రో ట్విస్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్సీబీ విచార‌ణ‌లో రియా చక్ర‌వ‌ర్తి ముందుగా కొంద‌రు హీరోయిన్ల పేర్లు బ‌య‌ట పెట్టింది. రియా చెప్పిన 25 మంది లిస్టులో సారా ఆలీఖాన్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ పేర్లు ఉన్న‌ట్టు సోమ‌వారం ఎన్సీబీ అధికారికంగా ప్ర‌క‌టించింది. వీరితో పాటు ప్ర‌ముఖ డిజైనర్ సిమోనె ఖంబట్టా పేరును కూడా చెప్పినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.

Sara Ali Khan, Rakul Preet Singh, Simone KHambatta Named In Drug Probe: NCB  Director

ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక నుంచి వీరి విష‌యంలో ఎన్సీబీ ఎలా ముందుకు వెళుతుంది అన్న‌ది చూడాల్సి ఉంది. డ్ర‌గ్స్ కేసులో స‌మ‌న్లు జారీ చేసేందుకు 25 మంది సెల‌బ్రిటీల లిస్టు సిద్ధం చేశారా ? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ఎన్సీబీ నుంచి స‌రైన ఆన్స‌ర్ రాలేదు. ఇప్ప‌టికే రియా ర‌కుల్‌, సారాతో పాటు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్ల‌ను చెప్పిన‌ట్టు ముందు నుంచి ప్రచారం జ‌రిగింది. త‌ర్వాత అదంతా ఊహాగానాలేనని వార్తలు వచ్చాయి.

rhea chakraborty news: Mumbai Police grills Rhea Chakraborty for 9 hrs,  actress admits she fought with Sushant S Rajput - The Economic Times

దీంతో చాలా మంది ర‌కుల్‌కు అండ‌గా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నెటిజ‌న్లు అయితే సోషల్ మీడియా వేదికగా #NoRakul #NoSara అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తూ ర‌కుల్‌, సారాకు సారీ కూడా చెప్పారు. చివ‌ర‌కు టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా మద్దతు తెలిపింది. కానీ అంతలోనే ఎన్సీబీ అధికారిక ప్రకటన చేస్తూ.. సారా, రకుల్ పేర్లను రియా చెప్పింద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ వీరు చిక్కుల్లో ప‌డిన‌ట్ల‌య్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news