Gossipsప్ర‌భాస్ ఆదిపురుష్ బ‌డ్జెట్ తెలిస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాకే... వామ్మో అన్ని...

ప్ర‌భాస్ ఆదిపురుష్ బ‌డ్జెట్ తెలిస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాకే… వామ్మో అన్ని కోట్లా…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్ రాధేశ్యామ్ కంప్లీట్ అయిన వెంట‌నే నాగ్ అశ్విన్ తెర‌కెక్కించే సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో న‌టిస్తాడు. ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఆదిపురుష్ సినిమాలో న‌టించ‌నున్నాడు. రామాయ‌ణంలోని ఓ క‌థ‌ను ఆథారంగా చేసుకుని ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన తన్హాజీ సినిమాను ఓం రౌత్ తెర‌కెక్కించాడు. ఇక ఇప్పుడు హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కే ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంక రావ‌ణుడు అయిన లంకేశ్ పాత్రలో కనిపించనున్నాడు.

Om Raut on casting Prabhas as Lord Ram in Adipurush: He is perfect for the  role | Entertainment News,The Indian Express

ఇక ఈ సినిమా బ‌డ్జెట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. టీ సీరిస్ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఖర్చు దాదాపుగా రూ. 700 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కించే సినిమాలు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఈ సినిమా థియేట‌ర్లలోకి వ‌చ్చే స‌రికి మ‌రో నాలుగేళ్లు ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా రు. 1000 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ సినిమా రేపు సెట్స్ మీద‌కు వెళ్లే స‌రికే ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news