Gossipsప్ర‌భాస్ పెళ్లి ఆ అమ్మాయితోనే ... ఇక ఈ బ్యాచిల‌ర్ లైఫ్‌కు...

ప్ర‌భాస్ పెళ్లి ఆ అమ్మాయితోనే … ఇక ఈ బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి అదిరిపోయే అప్‌డేట్ ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గ‌మైన క్ష‌త్రియ క‌మ్యూనిటీలో వైర‌ల్ అవుతోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం ప్రాంతంలో అన్ని రంగాల్లోనూ క్ష‌త్రియుల‌దే ఆధిప‌త్యం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్‌కు పిల్ల‌ను ఇచ్చేందుకు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న ఎంతో మంది క్ష‌త్రియ క‌మ్యూనిటీకి చెందిన వ్యాపార‌వేత్త‌లు, ధ‌న‌వంతులు ఎప్ప‌టి నుంచో కృష్ణంరాజు ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం రాధేశ్యామ్ ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ సైన్స్‌ఫిక్ష‌న్ సినిమా, ఆ వెంట‌నే ఆదిపురుష్ సినిమాల‌ను ప్ర‌భాస్ లైన్లో పెట్టాడు. ఇప్ప‌టికే బాహుబ‌లి సినిమా కోస‌మే ఏకంగా 5 ఏళ్ల పాటు టైం కేటాయించాడు. ఇప్పుడు ఈ మూడు సినిమాలు అంటే మ‌రో మూడు, నాలుగేళ్లు ఈజీగా పట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే ఈ లోగానే ప్ర‌భాస్ పెళ్లి చేసేయాల‌ని కృష్ణంరాజుతో పాటు కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో భీమ‌వ‌రంలో ఓ వ్యాపార వేత్త‌ల కుటుంబానికి చెందిన అమ్మాయితోనే ప్ర‌భాస్ పెళ్లి ఉంద‌ని అంటున్నారు.

ఆమె ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటున్నార‌ని ప్ర‌భాస్ క‌మ్యూనిటీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తుల నుంచే తెలిసింది. ఈ క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భాస్ పెళ్లి ఉంటుందా ? లేదా ? వ‌చ్చే యేడాది సంక్రాంతి త‌ర్వాత ఉంటుందా ? అన్న దానిపై మాత్ర‌మే క్లారిటీ రావాల్సి ఉంది.. ఏదేమైనా వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్‌లోప‌ల ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగిపోవ‌డం అయితే ప‌క్కా అన్న స‌మాచార‌మే ఉంది. మొత్తానికి ప్ర‌భాస్ కూడా ఓ ఇంటివాడు అయితే ఈ బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news