అతి చేస్తున్న సాయి పల్లవి..!

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నా అందులో చాలా వరకు సారీ.. చేయనని చెప్పుకుంటూ వస్తుందట. మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ అంతటా క్రేజ్ తెచ్చుకున్న ఈ నటీమణి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈమధ్య తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట సాయి పల్లవి.

సినిమాలో తన పాత్ర బాగుంటేనే తప్ప ఆ సినిమాకు ఒప్పుకోవట్లేదట. గీతా ఆర్ట్స్ సంస్థలో వరుసగా వచ్చిన 3 సినిమా ఆఫర్లను సాయి పల్లవి కాదనుకుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో ముందు సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కాని ఆమె ఆ సినిమాలో లిప్ లాక్ ఉందని చేయనని చెప్పిందట.

ఇక అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో కూడా ముందు సాయి పల్లవిని అడిగాక ఆమె కాదని చెప్పడంతో పూజా హెగ్దెకి ఆ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా అఖిల్, బొమ్మ్మరిల్లు భాస్కర్ సినిమాలో కూడా సాయి పల్లవిని అడిగితే కథ విని తనకు పాత్ర నచ్చలేదని చెప్పి సైలెంట్ అయ్యిందట. గీతా ఆర్ట్స్ నుండి ఆఫర్లు రావడమే అదృష్టంగా భావించాలి కాని సాయి పల్లవి మాత్రం కథ బాగాలేదు.. పాత్ర బాగాలేదు అంటూ రకరకాల కారణాలతో సినిమాలు చేజార్చుకుంటుంది. ఇలానే వచ్చిన అవకాశాలను వద్దనుకుంటూ పోతే ఆమె కెరియర్ కు దెబ్బ పడేలా ఉందని చెప్పొచ్చు.

Leave a comment