అల్లు అర్జున్ తో అనిరుధ్ రవిచంద్రన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో.. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్, వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు.

సుకుమార్ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు కాని వేణు శ్రీరాం సినిమాకు ఐకాన్ టైటిల్ ఫిక్స్ చేసి త్వరలో ముహుర్తం పెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచంద్రన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తమిళంలో సూపర్ ఫాం లో ఉన్న అనిరుద్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే నాని జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న అనిరుద్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పుడు బన్ని ఐకాన్ కు మ్యూజిక్ డైరక్టర్ గా ఛాన్స్ అందుకున్నాడు. తన ప్రతి సినిమాలో మ్యూజిక్ విషయంలో జాగ్రత్త వహించే బన్ని అనిరుద్ కాంబినేషన్ లో ఎలాంటి ఆల్బం ఇస్తాడో చూడాలి.

Leave a comment