Gossipsవామ్మో..స్టార్ డైరెక్టర్ ఆఫర్ వద్దని పొమ్మంది..

వామ్మో..స్టార్ డైరెక్టర్ ఆఫర్ వద్దని పొమ్మంది..

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందం’మూవీలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో రష్మిక గోల్డెన్ హ్యాండ్ అనుకున్నారు..దర్శక నిర్మాతలు. వరుసగా ఈ అమ్మడికి ఛాన్సులు ఇవ్వడం మొదలు పెట్టారు. దేవదాసు సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డీయర్ కామ్రెడ్ లో నటిస్తుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న రష్మికు ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చినా రిజక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి హీరోయిన్ రష్మిక మందన షాక్ ఇచ్చింది. ఆయన సినిమాలో నటించేందుకు వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది.

సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్ కు రష్మిక హాజరయింది. కానీ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటంపై రష్మిక అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో రణ్ దీప్ హుడా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news