Gossipsఆ ట్విట్ తో మహేష్ 'భారీగా' లాభపడ్డాడా ?

ఆ ట్విట్ తో మహేష్ ‘భారీగా’ లాభపడ్డాడా ?

మిల్క్ బాయ్ మహేష్ ! ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరో. ఒకపక్క సినిమాల్లోనూ, మరోపక్క వాణిజ్య ప్రకటనల్లోనూ ఎడా పెడా నటిస్తూ అత్యధిక పారితోషకం తీసుకుంటున్నాడు. అనవసర వివాదాల జోలికి పోకుండా తన పని ఏదో తాను చూసుకుంటూ తన సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటూ మహేష్ ముందుకు వెళ్లిపోతుంటాడు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో క్రేజీగా దూసుకుపోతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా మహేష్ నటించిన ఆయన 25 వ సినిమా మహర్షి రిలీజ్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు మహేష్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే మహేష్ సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా సొమ్ములు వెనుకేసుకునే పనిలో పడ్డాడు. సాధారణం గా తాను ఎండార్స్ చేసే బ్రాండ్స్ పై పెద్దగా పోస్టులు పెట్టని మహేష్ ఇప్పుడు ఏకంగా మార్కెట్ లో కి లాంచ్ అయిన కొత్త మ్యూజిక్ యాప్ “స్పాటిఫై” గురించి ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఇతర దేశాల్లో బాగా ఫ్యామస్ అయిన ఈ ఆడియో స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు భారత దేశంలో కూడా లాంచ్ చేశారు. అయితే మహేష్ చేసిన సింగల్ ట్వీట్ కి దాదాపు గా లక్షల్లో పారితోషికం అందుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో మొదలయ్యింది. ఒక్క ట్వీట్ ఖరీదు లక్షల్లో ఉంది అంటే, కంపెనీ వాళ్లకి దాని ప్రతిఫలం కూడా డబుల్ ఉంటుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైతేనేం మహేష్ ట్విట్ ఫలితామా అని ఆ కంపెనీ యాప్ కి మాత్రం విపరీతమైన ప్రచారం వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news