Gossipsనాని గ్యాంగ్ లీడర్ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమర్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా గ్యాంగ్ లీడర్ అని ఫిక్స్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఐదుగురు ఆడవాళ్లతో హీరో చేసే హంగామా సినిమా అన్నమాట. ఆ ఐదుగురు గ్యాంగ్ కు లీడర్ ఒక్కడే అతనే మన హీరో నాని. అందుకే సినిమాకు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ప్రమేయం లేకుండా నాని సినిమాకు ఆ టైటిల్ పెట్టడంపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

గ్యాంగ్ లీడర్ టైటిల్ వాడితే మెగా హీరోలే వాడాలని కొందరి ఫ్యాన్స్ వాదన. నిన్న టైటిల్ ఎనౌన్స్ చేయడమే ఆలస్యం నాని మీద విమర్శలు చేస్తూ గ్యాంగ్ లీడర్ టైటిల్ కేవలం మెగాస్టార్ కు మాత్రమే ఒకవేళ వాడితే రాం చరణ్ వాడుకోవచు కాని నానికి మాత్రం వద్దని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే సినిమా నిర్మాతలుగా మైత్రి మూవీస్ మెగా ఆమోదం తీసుకున్న తర్వాతే ఈ టైటిల్ ఎనౌన్స్ చేసి ఉంటారని చెప్పొచ్చు. మరి మెగా ఫ్యాన్స్ ధాటికి నాని టైటిల్ మార్చుకుంటాడా లేక అలానే ఉంచుతారా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news