Gossipsస్టార్ హీరోను వల్లో వేసుకున్న కైరా అద్వాని..!

స్టార్ హీరోను వల్లో వేసుకున్న కైరా అద్వాని..!

ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా సరే తెలుగులో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటూ వస్తుంది. నిన్న మొన్నటిదాకా టాప్ రేంజ్ లో ఉన్న రకుల్, సమంత, కాజల్ మన ఆడియెన్స్ కు పాతబడిపోయారు. ఈ క్రమంలో కొత్త భామలకు ఎక్కువ ఎంకరేజ్ మెంట్ దొరుకుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పూజా హెగ్దె మంచి ఫాంలోకి వచ్చిందని చెప్పొచ్చు. మొదటి రెండు సినిమాలు సరిగా ఆడకున్నా డిజేతో అమ్మడి బికిని లుక్ అమ్మడి రేంజ్ ఏంటో చూపించింది. ఇక అదే దారిలో ఇప్పుడు మరో భామకి లక్కీ ఛాన్సుకు వస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియరా అద్వాని ఆ సినిమా హిట్ కొట్టడంతో ఆ వెంటనే రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కియరా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరంటే అది కియరా అద్వాని అని అంటున్నారు. చరణ్ వివిఆర్ కూడా హిట్ కళ కనిపిస్తుంది. మరి అది హిట్టైతే మాత్రం అమ్మడి వెంట స్టార్స్ పడటం ఖాయం.

బాలీవుడ్ మూవీ ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో హీరోయిన్ గా నటించిన కియరా అద్వాని ఈమధ్య లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ లో తన హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో సూపర్ అనిపించింది. ఇక చరణ్ వి.వి.ఆర్ సినిమా కూడా హిట్ పడితే అమ్మడికి ఇక తిరుగు ఉండదు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హింది రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తుంది కియరా ఆ సినిమాలో కియరా ముద్దుల వర్షం కురిపిస్తుందని తెలుస్తుంది. రానున్న రోజుల్లో బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా కియరా వరుస అవకాశాలను అందుకుంటుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news