Gossipsఅనుష్క వ్యవహారం మొత్తం బయటపడ్డది..!

అనుష్క వ్యవహారం మొత్తం బయటపడ్డది..!

స్వీటీ అనుష్కకు సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో అనుష్క సూపర్ స్టార్డం తెచ్చుకుంది. ఫీమేల్ లీడ్ లో అప్పట్లో విజయశాంతి తర్వాత అదే తరహా సినిమాలు చేసి మెప్పించింది అనుష్క. అరుంధతి నుండి భాగమతి వరకు ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ కథలకు సూపర్ క్రేజ్ తెచ్చింది అనుష్క. అయితే సైజ్ జీరో కోసం లావెక్కిన అనుష్క సన్నబడటానికి చాలా ఇబ్బందులు పడుతుంది. బాహుబలి-2, సింగ-3 లలో బొద్దుగానే కనిపించిన అనుష్క భాగమతి సినిమా కొన్ని సీన్స్ లావుగా కొన్ని సీన్స్ సన్నగా కనిపించింది.

భాగమతి సినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కాబట్టి అలా జరిగింది. ఇదిలాఉంటే కొద్దికాలంగా కెమెరాకు చిక్కకుండా ఉంటున్న అనుష్క మునుపటి రూపంకు వచ్చిందని. ఎప్పటిలానే సన్నగా మారిందని అన్నారు. అయితే కనిపించట్లేదు కాబట్టి అది నిజమే అనుకున్నారు. ఒకేసారి సన్నబడిన అనుష్క షాక్ ఇస్తుందని ఆశించారు. కాని నిన్న అనుష్క రాజమౌళి తనయుడి పెళ్లిలో మళ్లీ అంతే లావుగా కనిపించింది. అనుష్క సన్నబడింది అన్న టాక్ వచ్చినా ఆమె వ్యవహారం చూస్తే అలాంటిదేమి జరిగినట్టు లేదు.

రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్తుంది. ఇప్పటికే రాం చరణ్, ఎన్.టి.ఆర్, రానా, ప్రభాస్, అనుష్క, నానిలు జైపూర్ చేరుకున్నారు. రేపు అనగా డిసెంబర్ 30న కార్తికేయ పెళ్లి జరుగనుంది. దాదాపు ఇండస్ట్రీ పెద్దలంతా ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news