Gossipsఎవరా హీరోయిన్? వీరికెందుకంత మోజు..?

ఎవరా హీరోయిన్? వీరికెందుకంత మోజు..?

రాజకీయ వేడి పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఏ నాయకుడిని ఎలా ఇరికిద్దాం అన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఒక పార్టీ నేతలు మరో పార్టీ అధినేత మీద విమర్శలు చేయడం కామనే. విమర్శలు దాకా ఉంటే పర్వాలేదు కాని హద్దు దాటితే మాత్రం నానా రచ్చ అవుతుంది. లేటెస్ట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో పవన్ భార్యల గురించి ప్రస్థావించాడు జగన్.

అయితే దాని తర్వాత జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ జగన్ ఓ హీరోయిన్ తో దిగిన సెల్ఫీని బాగా ట్రోల్ చేస్తున్నారు. జగన్ తో ఉన్న ఈ అమ్మాయి ఎవరు.. ఆమెకు జగన్ కు ఏంటి సంబంధం లాంటి కామెంట్స్ తో నానా హంగామా చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై జగన్ స్పందించలేదు కాని ఆ సెల్ఫీ తీసుకున్న హీరోయిన్ స్పందించింది.

లవ్ ఇన్ మలేసియా సినిమాలో హీరోయిన్ అయిన అలేఖ్య సినిమా ఆడియోని జగన్ చేతుల మీద రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఆడియో పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జగన్ అంటే ఇష్టపడే ఆ హీరోయిన్ జగన్ ను అడిగిమరి సెల్ఫీ తీసుకుంది. అయితే దీన్ని పవన్ ఫ్యాన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. జగన్ తనకు పెద్దన్నయ్య లాంటి వాడు అంటూ ఆమె వివరణ ఇస్తుంది. పవన్ తన అభిమాన నటుడని.. ఆదర్శవంతమైన భావాలు కలవాడని అలాంటిది ఆయన ఫ్యాన్స్ ఇలా హర్ట్ చేయడం ఏం బాగాలేదని అంటుంది అలేఖ్య. మరి ఈ వివాదం ఎక్కడాకా వెళ్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news