Gossipsరిలీజ్ కి ముందే యూట్యూబ్ లో మోహిని సినిమా

రిలీజ్ కి ముందే యూట్యూబ్ లో మోహిని సినిమా

ఓ సినిమా ఎంత జాగ్రత్తగా తీశాం అన్నది కాదు ఎలాంటి లీకులు లేకుండా రిలీజ్ దాకా జాగ్రత్తపడ్డాం అన్నది ఇంపార్టెంట్. రీసెంట్ గా స్టార్ హీరోల సినిమాలకు ఈ బెదడ ఎక్కువైంది. ఇక మరో పక్క ఇదే అదునుగా సినిమా ప్రమోషన్స్ కు వాడేస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. అదెలా అంటే సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కనబరచడానికి సినిమాకు సంబందించిన సీన్స్ ముందే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఆ సీన్ ఉండేలా చూసుకుంటారు. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఆల్రెడీ ఇలాంటి మ్యాజిక్స్ తన ప్రతి సినిమాకు చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు త్రిష నటించిన మోహిని సినిమాకు ఆ ఫార్ములా ఫాలో అవుతున్నారు. రమణ మదేష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా రాబోతుంది.

టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఆసక్తి కలిగించినా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సినిమాలోని 2 నిమిషాల సీన్ మాత్రం ఏమంత కొత్తగా అనిపించలేదు. రెగ్యులర్ రివెంజ్ డ్రామాగానే ఈ సీన్ ఉండటం జరిగింది. మరి త్రిషకు ఈ మోహిని హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news