Gossipsలెక్కలేసుకు దిగాడు.. రజినీ చేసేది రాజకీయం కాదు వ్యాపారం..!

లెక్కలేసుకు దిగాడు.. రజినీ చేసేది రాజకీయం కాదు వ్యాపారం..!

స్టార్ హీరోగా ఉన్నన్నాళ్లు తన సినిమాల్లో నటించి.. తన సినిమాలతో పోటీ పడినా హీరోలకు వారివారికి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. కాని ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకుంటారో ఇక ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. సినిమా సెలబ్రిటీస్ పొలిటికల్ గా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉంటారు. తాజాగా రాజాకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించిన రజినికాంత్ గురంచి అప్పటిదాకా అభిమానించిన వారే ఇప్పుడు తప్పుపడుతున్నారు.

లేటెస్ట్ గా బాహుబలి కట్టప్ప అదేనండి సత్యరాజ్ రజిని పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రజినికాంత్ రాజకీయ అరంగేట్రం ఆధ్యాత్మిక వ్యాపారం అన్నారు సత్యరాజ్. రజిని రాజకీయాల్లోకి రావాలా వద్దా అని ఎన్నాళ్ల నుండో ఆలోచిస్తున్నారు. అలా వ్యాపారంలా లాభ నష్టాలు చూసి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సత్యరాజ్.

రజిని చేసేది రాజకీయం కాదు వ్యాపారమని.. అలాంటి రజిని ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానని చెప్పడం కామెడీగా ఉందని అన్నారు. ఇక రజనీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాల్ని సేకరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. మరి కట్టప్ప వ్యాఖ్యలకు రజిని ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news