Newsమహానటి "సావిత్రమ్మ" పై తప్పులు చెరిగిన రమాప్రభ !

మహానటి “సావిత్రమ్మ” పై తప్పులు చెరిగిన రమాప్రభ !

అలనాటి లెజెండరీ నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎంత ప్రేమ ఉందో ఈ సినిమా విజయం చూస్తుంటే అర్ధం అవుతుంది. సావిత్రి జీవితంలోని కోణాలను చూసేందుకు మహానటి చిత్రాన్ని చూస్తున్నారు జనాలు. అయితే సావిత్రితో చాలాకాలం ప్రయాణం చేసిన మరో నటి రమాప్రభ సావిత్రి జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

నటి రమాప్రభ తాజాగా ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. మహానటి చిత్రం తాను ఇంకా చూడలేదని.. తన చుట్టూ ఉన్నవారు ఈ సినిమా చూడాల్సిందిగా ఆమెను కోరారట. అయితే సావిత్రి నిజజీవితంలో తప్పు చేసిందని రమాప్రభ చెప్పుకొచ్చింది. సావిత్రి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె భర్త జెమిని గణేశన్ ఆమెకు బాగా సేవ చేసినట్లు రమాప్రభ చెప్పింది. సావిత్రి మరణంలో ఆయన తప్పు గోరంత కూడా లేదని రమాప్రభ తెలిపింది. అంతేగాక సావిత్రమ్మదే చాలా తప్పు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది. అంటే చెడ్డ విధంగా కాదులెండీ.. ఆమెకు ధర్మగుణం, స్నేహగుణం చాలా ఎక్కువని చెప్పింది రమాప్రభ. దీనితోపాటు మొండితనం కూడా అంతే ఎక్కువగా ఉండేదని.. తాను నమ్మిన వ్యక్తుల గురించి ఎవరూ చెడుగా చెప్పిన వినేది కాదని రమాప్రభ చెప్పింది.

సావిత్రమ్మకు మధ్యం ఎవరూ అలవాటు చేయలేదని రమాప్రభ అన్నారు. ఆమెకు ఎవరూ శత్రువులు లేరని.. పిల్లలను చాలా బాగా చూసుకునేదట. అయితే ఆమె అతిమంచితనమే ఆమెను బలితీసుకుందని రమాప్రభ అన్నారు. ఇలా సావిత్రి గురించి సెన్సేషనల్ కామెంట్ చేసిన రమాప్రభ వీడియో ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news