Newsబిగ్‌బాస్ టీజర్ అదిరింది.. కాన్సెప్ట్ మాత్రం కేక!

బిగ్‌బాస్ టీజర్ అదిరింది.. కాన్సెప్ట్ మాత్రం కేక!

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 2 అలరించేందుకు రెడీ అవుతోంది. సీజన్ 1ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఆ షో ఎలాంటి సక్సెస్‌ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ టూను హోస్ట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. వరుసబెట్టి వెండితెరపై సక్సెస్ కొడుతున్న నాని, తన విజయయాత్రను బుల్లితెరపై కూడా చూపించేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే బిగ్‌బాస్ 2కు సంబంధించిన ఒక ప్రోమోను రిలీజ్ చేసి ఈ షోపై అందరి అంచనాలను పెంచాడు. తాజాగా మరో కొత్త ప్రోమోతో నాని చితక్కొట్టాడు. మనోడు ప్రొడ్యూసర్‌గా ఇటీవల తీసిన అ! చిత్రం టీజర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి కాన్సెప్ట్‌తోనే బిగ్‌బాస్ 2 వీడియో ప్రోమోను రూపొందించారు నిర్వాహకులు. రకరకాల చేపలను చూపిస్తూ మనుష్యుల క్యారెక్టర్లను బ్యాక్‌గ్రౌండ్‌లో వివరించాడు నాని. ‘‘ఈ ప్రపంచంలో ఒక్కొక్కలు ఒక్కో రకం.. ’’ అంటూ ఇంటెన్స్ వాయిస్‌తో నాని చెప్పిన విధానం సూపర్. కేవలం చేపలతో ప్రోమో ఉంది అనుకునే లోపు నాని వాటికి ఫుడ్ వేస్తూ ప్రత్యక్షమవుతాడు.

మొత్తానికి బిగ్‌బాస్ రియాలిటీ షో ఈసారి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు ఎక్కడా తగ్గడంలేదని అనిపిస్తోంది. మరి తారక్‌ను నాని ఎంతవరకు మైమరిపిస్తాడో తెలియాలంటే బిగ్‌బాస్ 2 ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news