Moviesరామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్

రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సినిమా చూస్తూ.. చిత్ర యూనిట్‌ను కొనియాడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరాడు. చరణ్ నటన అద్భుతమని, ఆ పాత్రను ఇంకెవరూ అంత బాగా చేసేవారు కాదని తారక్ ట్వీట్ చేశాడు.

jr ntr tweet

తారక్ ఇంకో ట్వీటులో – ” సాహసోపేతమైన, అద్భుతమైన సినిమా తీసిన సుకుమార్ కు నా అభినందనలు. పూర్వ కాలపు భావోద్వేగమైన పీరియడ్ డ్రామాలు తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ సుకుమార్” అని రాసుకొచ్చాడు. సమంత, దేవిశ్రీప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ కు మరియు ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి నా అభినందనలు అని ఇంకో ట్వీటులో పేర్కొన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news