Gossipsకళ్యాణ్ పై బాలయ్య వెరీ సీరియస్..!

కళ్యాణ్ పై బాలయ్య వెరీ సీరియస్..!

నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ మీద వెరీ సీరీస్ గా ఉన్నారు. తన ప్రవర్తన బాగాలేనందు వల్ల బాలయ్య కళ్యాణ్ మీద సీరీస్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ బాలయ్య కళ్యాణ్ అసలు ఏంటి మ్యాటర్ అంటే. నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సింహా. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అన్నది చెప్పలేం కాని కళ్యాణ్ మాత్రం తన నిర్మాణంలో పెద్ద హిట్ వచ్చినట్టు భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ కళ్యాణ్ బాలయ్యతో సినిమాకు సిద్ధమయ్యాడు. బాలయ్య కూడా అందుకు ఓకే చెప్పాడు. అయితే కళ్యాణ్ అత్యుత్సాహం వల్ల బాలయ్యకు కోపం వచ్చిందట. వినాయక్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని బాలయ్య కూడా ఓకే చెప్పారని ప్రచారం చేస్తున్నాడట. ఈ వార్త ఫైనల్ గా బాలకృష్ణ చెవిన పడ్డదట.

ఆ తర్వాత కళ్యాణ్ ను పిలిచి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత సినిమా ఏంటన్నది మాత్రం ఇంకా డిసైడ్ అవలేదు. మరి కళ్యాణ్ తో బాలయ్య సినిమా ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news