Gossipsరంగస్థలం పై మెగా అభిమానులను వెటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

రంగస్థలం పై మెగా అభిమానులను వెటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి రివ్యూ యూ.ఏ.ఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధి ఇచ్చేశాడు. ఫస్ట్ క్లాస్ మాస్ మూవీ చెర్రి ఇరగదీసే నటనతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ 3.5 రేటింగ్ కూడా ఇచ్చాడు ఉమర్ సంధు.

అయితే ఈ సినిమాకు ఉమర్ సంధు ఇచ్చిన రివ్యూ పై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇతగాడు ఈమధ్య సూపర్ హిట్ ఇచ్చిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కాటమరాయుడు దగ్గర నుండి స్పైడర్ వరకు అన్ని సినిమాలు సూపర్ హిట్ అని ఉమర్ సంధు ఇవ్వగా అవన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే ఇప్పుడు రంగస్థలం సినిమాకు ఉమర్ సంధు సూపర్ హిట్ బొమ్మ అనేశాడు. దానికి మెగా ఫ్యాన్స్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ తో సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అని దిగులు పడుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా సమంత నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news