Moviesకళ్యాణ్ అన్న నాకు మరో నాన్న.. జై ఆడియోలో ఎన్టీఆర్..!

కళ్యాణ్ అన్న నాకు మరో నాన్న.. జై ఆడియోలో ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో నిన్న డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి ఈవినింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్బ్ గా వచ్చాయి. ఇక బెస్ట్ స్పీచర్ గా తారక్ మళ్లీ ఆడియో ప్రెస్ మీట్ లో అదరగొట్టాడు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా చేద్దామా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మనసుకి నచ్చిన సినిమానే చేద్దామని ఫిక్స్ అయ్యామని. అందుకే బాబి చెప్పిన కథ నచ్చి జై లవ కుశ చేశామని అన్నారు తారక్. ఈ సినిమా నాన్న(హరికృష్ణ) కు ప్రేమతో తన పుట్టినరోజున సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నాం కాని అది కుదరలేదని అన్నారు.

అన్నదమ్ముల మధ్య అనుబంధం తెలిపేలా ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తారక్. ఇక ఈ సినిమా నిర్మాత అన్నయ్య కళ్యాణ్ రాం తో పనిచేయడం చాలా మంచి అనుభూతి అని అన్న నాకు మరో నాన్న అంటూ సంభోదించాడు తారక్. దేవి తనకు ఎలాంటి సాంగ్స్ కావాలన్నా ఇస్తాడని దేవి సాంగ్స్ అంటే సినిమా సగం హిట్టే అన్నట్టుగా మాట్లాడారు తారక్. ఇక సెప్టెంబర్ 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దామని అన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news