Moviesపవర్ స్టార్ త్రివిక్రం ఫస్ట్ లుక్.. బొమ్మ హిట్ గ్యారెంటీ..!

పవర్ స్టార్ త్రివిక్రం ఫస్ట్ లుక్.. బొమ్మ హిట్ గ్యారెంటీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ త్రివిక్రం కలిసి చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ మాత్రం సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమాలో మలయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా 2018 సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది. అంచనాలను పెంచేలా వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు ఫస్ట్ లుక్ చూస్తే బొమ్మ హిట్ గ్యారెంటీ అనేస్తున్నారు.

ఇక సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినపడుతున్నా ఫైనల్ గా రాజు వచ్చినాడే అన్నది పెట్టేస్తున్నారని అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది కాని టైటిల్ పై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ps1 (1)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news